గ్రేటర్ న్యూస్, వరంగల్ : గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును వరంగల్ కు చెందిన పలువురు ప్రముఖులు శనివారం మర్యాదపూర్వకంగా
కలిశారు. గోవా పర్యటనలో ఉన్న వీరు, రాజధాని పనాజీలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వరంగల్ వాయిస్
దినపత్రిక ఎడిటర్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్ కొలుగూరి ప్రభాకర్ రావు, ప్రకాష్ తదితరులు ఉన్నారు.

