Breaking
26 Mar 2026, Thu

జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన ఆశిష్ ని అభినందించిన విష్ణు…

గ్రేటర్ న్యూస్,హనుమకొండ :ఇటీవలే విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 678 ర్యాంకు సాధించిన హనుమకొండ నగరానికి చెందిన అనిశెట్టి ఆశిష్ ని శనివారం వరంగల్ పశ్చిమనియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా విష్ణు రెడ్డి మాట్లాడుతూ… పశ్చిమ నియోజకవర్గంలోని యువత అందరూ చదువుల్లో పోటీ పడాలని ఆశిష్ లాంటి వారికి తమ ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు విష్ణు తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాడిశెట్టి విద్యాసాగర్, ఆర్టీఐ మెంబర్ కాంగ్రెస్ యూత్ నాయకులు పల్లకొండ సతీష్, రాహుల్ రెడ్డి,నలుబోల సతీష్ బయ్యగోని కుమారస్వామి,నలుబోల కార్తీక్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *