గ్రేటర్ న్యూస్, వరంగల్ : జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా విషయంలో ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నేడోక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చిందని పేర్కొన్నారు.కొంతమంది వినియోగదారులు సిలిండర్ల కొరత వచ్చే అవకాశం ఉందని భావించి ముందుగానే ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు.గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగా సగటున 2.5 రోజులలోపే జరుగుతోందని తెలిపారు.అందువల్ల వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని, ముందుగానే బుకింగ్ చేయడం లేదా సిలిండర్లను నిల్వ ఉంచడం అవసరం లేదని సూచించారు.ప్రజలు ఎలాంటి అపోహలకు లోనవకుండా సాధారణ విధానంలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

