గ్రేటర్ న్యూస్ హనుమకొండ : గ్రేటర్ వరంగల్ పరిధిలోని 31 డివిజన్ హంటర్ రోడ్డు విశాల్ మార్ట్ వెనుకల ఉన్న శ్రీ అభయఆంజనేయ స్వామి కాలనీలో శనివారం స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు పర్యటించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ స్థానికులను కాలనీ లోని సమస్యలను అడిగి తెలుసుకోగా..కాలనీలోని డ్రైనేజీ,సీసీ రోడ్లు పలు సమస్యలను కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టి కి తీసుకెళ్లడం జరిగింది. అనంతరం కార్పొరేటర్ మామిండ్ల రాజు మాట్లాడుతూ… డివిజన్ లోని శుభ్రత పరిశుభ్రత ఇతర సమస్యలను తెలుసుకోవడానికి కాలనీలో పర్యటిస్తున్నానని ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టి తీసుకువస్తే త్వరగా పరిష్కరించే విధంగా అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

