Breaking
26 Mar 2026, Thu

డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను నివారించగలం… వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

  • ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
  • నాలుగు వందల మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు
  • మూడు వందల మందికి కంటి అద్దాలు అందజేత

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రెండవ విడతలో వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు రోడ్డులోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రిజినయన్ ఐ హాస్పిటల్ , శరత్ ఐ హాస్పిటల్ , కీర్తి హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గోని కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి సుమారు నాలుగు వందలకుపై ఆటో డ్రైవర్లు కంటి పరీక్షలు నిర్వహించుకోగా, మూడు వందలకుపై డ్రైవర్లకు కంటి అద్దాలను అందజేయడం జరింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్య మంత్రి ‘అరైవ్ అలైవ్’ ప్రారంభించడం జరిగిందని రోడ్డు నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని, ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం సహజమని అన్నారు. ముఖ్యంగా ప్రజలను తరలించే ప్యాసింజర్ వాహనాలకు చెందిన డ్రైవర్లు తమ కంటి చూపుపై మరింత శ్రద్ధ వహించాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి గమ్య స్థాలను క్షేమంగా చేరవేయాల్సిన బాధ్యత డ్రైవర్లపై వుందని, ముఖ్యంగా కంటి చూపుతో బాధపడే వారు వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికమని, రోడ్డు ప్రమాదాల నివారణకై డ్రైవర్లు సైతం నిరంతం కంటి పరీక్షలు నిర్వహించుకోవడం క్షేమకరమని అదే విధంగా కంటి చూపు బాగుంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలను గుర్తించడం ద్వారా సురక్షితంగా డ్రైవింగ్ చేయగలమని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు కంటి అద్దాలను అందజేసారు.

ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డిసిపి ప్రభాకర్ రావు, ఏసిపిలు సత్యనారయణ,నర్సింహరావు, ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు సుజాత, సీతా రెడ్డి,వెంకన్న, మట్టెవాడ ఇన్స్ స్పెక్టర్ కరుణాకార్, డాక్టర్లు శ్రీదేవి,డా.దిలిప్,రంజన్ కుమార్ వారి సిబ్బంది పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *