Breaking
26 Mar 2026, Thu

దోమల బాధ నుండి గోపాలపురాన్ని రక్షించండి….రావుల వెంకట రమేష్ గౌడ్

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : నగరంలోని 56వ డివిజన్ గోపాలపురంలో దోమల సమస్య తీవ్రంగా ఉందని వెంటనే హనుమకొండ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ స్పందించి అన్ని కాలనీల్లో దోమల స్ప్రే చేయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కంటెస్టెడ్ కార్పొరేటర్ రావుల వెంకట రమేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కాలనీల్లో చాలాకాలంగా దోమల మందు స్ప్రే చేయకపోవడం వల్ల రాత్రి వేళల్లో దోమలు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయన్నారు డెంగు ,మలేరియా వంటి వ్యాధుల భయం ప్రజల్లో పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ గోపాలపురం ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని  గోపాలపురం కంటెస్టెడ్ కార్పొరేటర్ రావుల వెంకట రమేష్ గౌడ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *