Breaking
26 Mar 2026, Thu

నేర పరిశోధనలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకం…. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

-వరంగల్ కమిషనరేట్‌లో నూతనంగా చేరిన భైరవ్, విరాట్ పోలీస్ జాగిలాలు


-ఎనిమిది నెలలు శిక్షణ కాలాన్ని పూర్తి చేసి ఉత్తమ ప్రతిభ కబనబరిచిన భైరవ్ జాగిలానికి బంగారు పతకం

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ తెలియజేసారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజేన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎనిమిది నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్ జాతి చెందిన భైరవ్, విరాట్ జాగిలాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు తమ సేవలందించేందుకు నూతనంగా విధుల్లోకి చేరిన నూతన పోలీస్ జాగిలాలను వరంగల్ సీపీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఈ పోలీస్ జాగిలాల హ్యాండ్లర్లు కుమార స్వామి (భైరవ్ హ్యాండ్లర్), సాంబయ్య (విరాట్ హ్యాండ్లర్) లను జాగిలాల పనితీరును అడిగితెలుసుకున్నారు. అనంతరం శిక్షణ కాలంలో జాగిలాలకు నిర్వహించిన క్లిష్టతరమైన పరీక్షల్లో ఉత్తమంగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన భైరవ్ జాగిలానికి సీపీ మెడల్ అలంకరించి హ్యాంగ్లర్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

ఈ సందర్బంగా వరంగల్ సీపీ మాట్లాడుతూ… ఈ నూతన జాగిలాలు ప్రేలుడు పదార్థాలను సులభంగా పసిగడతాయని ఈ శునకాలు చూడటానికి చిన్న ఆకారంలో వున్నా పెద్ద జాగిలాలు వెళ్ళలేని ప్రదేశాలు, మార్గాల్లో ఈ జాగిలాలు వెళ్ళి ప్రేలుడు పదార్థాలను గుర్తుస్తాయని అన్నారు.ముఖ్యంగా విమానాల్లో ప్రయాణికుల సామాను భద్రపర్చే క్యాబిన్లల్లో కార్ల క్రిందకు వెళ్ళి ప్రేలుడు పదార్థాలను గుర్తించడం ఈ జాగిలాల ప్రత్యేకతని సీపీ తెలిపారు. ముఖ్యంగా ఈ పోలీస్ జాగిలాల ద్వారా గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నో కేసుల్లో నిందితులను గుర్తించడంతో పాటు మత్తు పదార్థాలను గుర్తించడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

ఈ కార్యక్రమములో అదనపు డిసిపిలు శ్రీనివాస్, రవి, ఏసిపి సురేంద్ర, ఆపరేషన్స్ ఆర్.ఐ సింహాచలం శ్రీనివాస్, డాగ్ స్వ్కాడ్ ఇంచార్జ్ ప్రభాకర్ లు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *