గ్రేటర్ న్యూస్, వరంగల్ :
‘పరాభవ’ నామ సంవత్సరం – వైఫల్యం నుంచి వైభవం వైపు ప్రయాణం..!
“ఉగాది పండుగ మరియు ‘పరాభవ’ నామ సంవత్సరం యొక్క విశిష్టతను వివరిస్తూ, ఆధ్యాత్మిక మరియు వ్యక్తిత్వ వికాస సందేశం..”
“అయితే, 2026 మార్చి 19 తెలుగు సంవత్సరం ప్రారంభం ‘పరాభవ’ అనే పేరు ఉండటం చాలా మందిలో ఆసక్తిని, మరికొందరిలో ఆందోళనను కలిగిస్తోంది..”
“సాధారణంగా ‘పరాభవం’ అంటే అవమానం లేదా ఓటమి అని మనం భావిస్తాం..”
“కానీ, ఈ పేరు వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం తెలిస్తే, మనం ఈ ఏడాదిని ఎంత ఉత్సాహంగా ఆహ్వానించాలో అర్థమవుతుంది..”
‘పరాభవ’ అంటే ఏమిటి..?
పరా: అంటే అత్యున్నత మైన, గొప్పదైన అని అర్థం
భవ: అంటే పుట్టుక, లేదా స్థితి అని అర్థం.
“సంస్కృత భాషలో ప్రతి పదానికి ఒక లోతైన భావం ఉంటుంది..”
‘పరాభవ’ అనే పదాన్ని విడదీసి చూస్తే:
“అంటే, మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బలహీనతలను ఓడించి (‘పరాభవం’) , ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ ఏడాది యొక్క అసలు సందేశం..”
“ఈ పరాభవ సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ‘సెల్ఫ్-ట్రాన్స్ఫర్మేషన్’ (స్వయం పరివర్తన)”
“2026 ఉగాది మనకు ఒక కొత్త ఆరంభం..”
“2026 ఉగాది మనకు ఇచ్చే గొప్ప అవకాశం ఏమిటంటే – మనల్ని మనం పునర్ నిర్మించుకోవడం.. ఓటమిని చూసి కుంగిపోకుండా, దాన్ని గెలుపుకు మెట్టుగా మార్చుకోవడమే ఈ పరాభవ నామ సంవత్సర విశిష్టత..”
“అలాగే మనలోని లోపాలను పరాభవం చేస్తేనే మనలోని దైవత్వం వెలుగులోకి వస్తుంది..”
ఈ పరాభవ నామ సంవత్సరం నుండి మీరు ఏ నెగటివ్ క్వాలిటీని ‘పరాభవం’ చేయాలనుకుంటున్నారు.. వెంటనే డిలీట్ చేయండి ఆరోగ్యంగా జీవించండి
