గ్రేటర్ న్యూస్, వరంగల్ : యశోద హాస్పిటలలో రోబోటిక్ అసిస్టెడ్ ఎండోస్కోపిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ డాక్టర్ కే.ఎస్ కిరణ్ తెలిపారు. ఈ రోజు హనుమకొండ నక్కలగుట్ట లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ఇటీవల వరంగల్ నుండి వచ్చిన 50 ఏళ్ల మహిళ పేషెంట్‌కు ‘నావిగేషన్ అసిస్టెడ్ బయాప్సీ’ విజయవంతంగా నిర్వహించామని ఆమె గత నెల రోజులుగా మెదడులో గడ్డ, టి.బి లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు.మొత్తానికి మా యొక్క వైద్యులు అందరూ కూడా సరైన నిర్ణయమే తీసుకున్నారని ఒక నెల రోజులుగా టిబి గడ్డ పెరుగుతుండటం, అది ఒక క్రిటికల్ ఏరియాలో ఉండటం వల్ల బయాప్సీ కోసం మా దగ్గరికి వచ్చారని తెలిపారు. మేము ఈ బయాప్సీ కోసం రోబోటిక్ నావిగేషన్ అసిస్టెడ్ సర్జరీ ని ఉపయోగించి ఆ గడ్డను పూర్తిగా తొలగించామని డాక్టర్ కిరణ్ తెలిపారు.అదృష్టవశాత్తు అది టిబి గడ్డ అని తేలిందని సాధారణంగా టిబి మందులు వాడినా ఎందుకు తగ్గలేదంటే, ఇది డ్రగ్-రెసిస్టెంట్ టిబి రకానికి చెందిందన్నారు.వెంటనే మందులు మార్చి చికిత్స అందించడం ద్వారా ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నామని డాక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో వైద్యలు, సిబ్బంది పాల్గొన్నారు.

