Breaking
26 Mar 2026, Thu

వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని…

NGOs కాలనీ వెంకటేశ్వర స్వామి వారి దక్షిణ గోపుర నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నాయిని

గ్రేటర్ న్యూస్,హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 59 వ డివిజన్ వికాస్ నగర్ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభయాంజనేయ స్వామి పునఃప్రతిష్ట మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే నాయిని పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు.అనంతరం 58వ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దక్షిణ గోపుర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంసందర్భంగా ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  భూమి పూజలో పాల్గొని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ… ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. ఇలాంటి దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎప్పటికప్పుడు సహకారం అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *