గ్రేటర్ న్యూస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం, వివిధ విశ్వబ్రాహ్మణ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పంచాంగ రత్న కట్టవారు వెంకట మధుసూదన్ సిద్ధాంతి గుణించిన శ్రీ పరాభవ నామ సంవత్సర శ్రీ లలితా పంచరత్న పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది.సోమవారం హనుమకొండ టైలర్ స్ట్రీట్ లోని ఒక ప్రైవేట్ వేడుకల హాల్ లో హనుమకొండ జిల్లా అధ్యక్షులు అలుగోజు కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు గంగు ఉపేందర్ శర్మ,శ్రీ భద్రకాళీ దేవాలయం ప్రధాన అర్చకులు శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుని, శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి చిత్రపటాల వద్ద పూజాదికాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా పై విశిష్ట అతిధులు మాట్లాడుతూ… సకల చరాచర సృష్టి కర్త విశ్వకర్మ పరమేశ్వరుని కాలజ్ఞాన రచయిత,బ్రహ్మ జ్ఞాని పరమేశ్వర స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులతో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సమస్త మానవాళికి,విశ్వబ్రాహ్మణులందరికీ శుభం జరుగాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఓరుగల్లు ఉమ్మడి జిల్లాలోని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులైన కౌన్సిలర్లు బెజ్జంకి పుర్ణాచారి,గుంటోజు పావని,శ్రీరామోజు రోజారాణి,సర్పంచ్ రాగి సంగీతలను ఘనంగా సన్మానించారు.విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ అర్చక పౌరోహితులు తుమ్మెనేపల్లి రవీంద్రా చార్యులు,ఇటికెల సనాతనా చార్యులు,చొల్లేటి సురేషాచార్యులు ద్వాదశ రాశుల వారికి ఆదాయ, వ్యయాల ఫలాలు క్లుప్తంగా వివరించారు. అనంతరం గడచిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతి మహిళలను సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. చివరగా రాష్ట్ర సంఘం కార్యదర్శి డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్థన్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.కార్యక్రమంలో పాల్గొన్న విశ్వబ్రాహ్మణ రాష్ట్ర,జిల్లా సంఘాల నాయకులను కండువాలతో సత్కరించారు. హాజరైన వారికి పంచాంగాలు, భక్ష్యాలు, ఉగాది పచ్చడ అందించారు.ఈ కార్యక్రమంలో నాయకులు పెందోట సురేష్ కుమార్,శ్రీరామోజు నాగరాజారావు,వీణవంక సదానందం,పెందోట చక్రపాణి,వైద్యులు పొలాస రమేష్, డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్థన్,బొజ్జ రవీందర్ శ్రీరామోజు నాగ సోమేశ్వరాచారి,కట్టా ఈశ్వర ప్రసాద్,న్యాయవాది కొక్కొండ రమేష్, గజ్జెల వీరన్న,సిద్దోజు వీరన్న,మహారాజ భరత్, రుద్రోజు భవాని,వంగల కల్పన, కర్ణకంటి భారతి,మడుపు సత్యం, పానుగంటి శ్రీధర్, కొత్తగట్టు బ్రహ్మచారి, కటుకోజ్వల సత్యనారాయణ,కత్రోజు లింగాచారి,తాటికొండ మల్లేశం,బొల్లోజు బ్రహ్మం,బొజ్జ వెంకన్న,కొక్కొండ రాధాకృష్ణ, అకినెపెల్లి సతీష్,విద్యా,ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

