గ్రేటర్ న్యూస్, వరంగల్ : నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సీఎం నిధుల కేటాయించిన సందర్బంగా కృషి చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని, ఎంపీ లకు కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా కో ఆర్డినేటర్ కల్లూరి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో జరుగని అండర్ డ్రైనేజీ నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ను నిలబెట్టుకుందన్నారు.యూ జి డి నిర్మాణం వలన వరంగల్ నగరం అభివృద్ధి చెందుతుందని 5257.20 కోట్లు నిధులు తేవడం లో కృషి చేసిన ఎమ్మెల్యే నాయిని,ఎంపీ కావ్య కు కృతజ్ఞతలు తెలిపారు.

