Breaking
26 Mar 2026, Thu

సైన్స్ అనేది మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశం…డాక్టర్ జి. సీతారాం

గ్రేటర్ న్యూస్,జనగామ : సైన్స్ అనేది మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన అంశమని ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ జి. సీతారాం అన్నారు. శనివారం జనగామ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీ లో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్, సూపర్డెంట్ బానోత్ దేవిలాల్ ఆదేశాల మేరకు జనగామ పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీలో కళాశాల నందు నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు అధిక సంఖ్యలో పాల్గొని వారి ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. సీతారాం మాట్లాడుతూ…ఈ ప్రపంచాన్ని శాస్తిస్తూ. నడిపించే శక్తిగా సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని వారు అన్నారు. నేషనల్ సై న్స్ డే ని పురస్కరించుకుని విద్యార్థులు పలు రకాల సైన్స్ ఎగ్జిబిట్స్ స్వయంగా తయారుచేసి  ప్రదర్శించారు. సోలార్ పవర్ ఇరిగేషన్, భూకంప అలారం, ఎయిర్ పొల్యూషన్, విద్యార్థి ని విద్యార్థులలో వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా శాస్త్రీయ దక్పథం పెంపొందుతుందని ముఖ్యంగా ప్రతి విద్యార్థి సజనాత్మకంగా ఆలో చించే తత్వాన్ని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. నోబె ల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ పరిశోధనల నుంచి ప్రేరణ పొంది, మరిన్ని కొత్త కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు నాంది కావాలన్నారు. మొదటి బహుమతి ఎం సౌమ్య, రెండవ బహుమతి సింగారపు రమ్య, తృతీయ బహుమతి భాగ్యశ్రీ,అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పరమేశ్వర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ మండ రాజేష్ గౌడ్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఆయుబ్ ఖాన్, పావని, ముంతాజ్, కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *