Breaking
26 Mar 2026, Thu

స్వామి కార్యము స్వకార్యంగా హరీష్ రావు పర్యటన..!!ఎమ్మెల్యే నాయిని

మీ హయాంలో కాజీపేటకు చేసింది శూన్యం..

హరీశ్ రావు పర్యటనపై మండిపడ్డ ఎమ్మెల్యే నాయిని

గ్రేటర్ న్యూస్, హనుమకొండ :కాజీపేట పర్యటనలకు వస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావు  10 ఏళ్లు బీజేపీ,బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్బంగా శనివారం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ…గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పొన్నాల లక్ష్మయ్య  మంత్రిగా ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి 54 ఎకరాల స్థలాన్ని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తీసుకోవడం జరిగిందని అన్నారు.సీనియర్ శాసన సభ్యునిగా ఉన్న హరీశ్ రావు కూడా దుష్ప్రచారాలు చేయడం సబబు కాదని వరంగల్ ప్రజలను ఇంక ఎన్ని సార్లు మోసం చేస్తారని పర్యటనలో పేరుతో 10 ఏళ్ళు పబ్బం గడించింది మీరే కదా అని ప్రశ్నించారు.15 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న మాజీలు అందరూ కాజీపేటకు చేసింది ఎంటో చెప్పాలన్నారు.నోట్ల రద్దు,GST పన్ను,వ్యవసాయ చట్టాలకు దేశంలో మొదటగా అసెంబ్లీలో తీర్మానాలు చేసింది మీరే కదా అని మండిపడ్డారు.విభజనకు చట్టంలో సోనియా గాంధీ  పొందు పరిచిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం ఉక్కు కర్మాగారం,ట్రైబల్ యూనివర్సిటీ లను 10 ఏళ్లలో ఒక్కరోజైనా కేంద్రంతో మాట్లాడారని అన్నారు.కాజీపేటకు 30 పడకల దవాఖానా ఆవశ్యకత ఉన్నప్పటికీ కనీసం ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు.కాజీపేట రైల్వే ఉద్యోగులకు స్థానికత క్రమంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికంగా మేము,అన్ని వర్గాల వారు డిమాండ్ చేస్తున్నమన్నారు.కానీ కొత్తగా మీరు వచ్చి అ పోరాటం చేస్తుంటే హాస్యాస్పదమని అన్నారు.వరంగల్ ప్రజలు మీ పర్యటనలు,ధర్నాలు చేస్తుంటే నవ్వుకుంటున్నారని విమర్శించారు.వరంగల్ ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మా హయాంలో కాజీపేటకు బస్ స్టాండ్ నిర్మాణం కోసం స్థలాన్ని ఏర్పాటు చేస్తూ,మధ్యలో ఆగిన కాజీపేట ROB పూర్తి చేయడం,నగరాన్ని మాస్టర్ ప్లాన్,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,విమానాశ్రయం నిర్మాణం వంటి పనులను చేపట్టడం జరిగిందన్నారు.12 లో 11 సీట్లు ఉమ్మడి జిలాల్లో మాకు ప్రజలు ఇచ్చారు అంటే మిమ్మల్ని ప్రజలు ఎక్కడ ఉంచారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *