గ్రేటర్ న్యూస్, ఎల్కతుర్తి :తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నేటి నుండి ప్రారంభమవుతుండం తో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, కేశవపూర్ గ్రామంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై సీపీ సంబంధించిన పోలీస్ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ సంబంధించి రెవెన్యూ, పోలీసు అధికారులు సిబ్బంది, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై పోలీస్ కమిషనర్ పలుసూచనలు చేయడంతో పాటు, స్వీకరణ కేంద్రాల్లో భద్రతాపరంగా పోలీసులు పగధ్బంది ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సీపీ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డిసిపి కవిత, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్, ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

