Breaking
30 Aug 2026, Sun

Te-Poll మొబైల్ యాప్ ను ప్రతి ఓటరు  వినియోగించుకోవాలి:  కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

గ్రేటర్ న్యూస్, వరంగల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ప్రకటనలో తెలిపారు.

ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకోగలుగుతారని పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో ఓటరు అవగాహన,ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియాగించుకోవాలని అన్నారు.ఈ యాప్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

గూగుల్ ప్లే స్టోర్ లింక్:
https://play.google.com/store/apps/details?id=com.cgg.gov.in.te_poll_telugu

ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకుని ఓటింగ్‌లో ప్రక్రియలో పాల్గొనాలని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *