Breaking
26 Mar 2026, Thu

‘టీ-సేఫ్’ యాప్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నేరాలపై షీటీమ్ అవగాహన

గ్రేటర్ న్యూస్, వరంగల్ : మహిళలపై పెరుగుతున్న సైబర్ నేరాలు, అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని షీ టీమ్ సీఐ కె. సుజాత సూచించారు.గురువారం సికేఎం కాలేజ్ దేశాయిపేట వరంగల్ నందు విద్యార్థి, విద్యార్థినులకు ‘టీ-సేఫ్’ యాప్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నేరాలపై షీ టీమ్ ఇన్స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ  కార్యక్రమంలో  షీ టీమ్ సీఐ సుజాత మాట్లాడుతూ…సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకునే విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో భద్రత కోసం ‘టీ-సేఫ్’ యాప్ ను వినియోగించాలని, దీనిపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తే ధైర్యంగా వెంటనే షీ టీమ్ వరంగల్ పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని, సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచి, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ స్వాతి,మహిళా కానిస్టేబుల్ పూర్ణ, కళాశాల యాజమాన్యం,విద్యార్థులు,సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *