Breaking
30 Aug 2026, Sun

వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

గ్రేటర్ న్యూస్,హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ని గురువారం హైదరాబాద్ లోని వారి నివాసంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య , మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన సందర్బంగా వేం నరేందర్ రెడ్డి కి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనగామ డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, మాజీ పిఏసీఎస్ చైర్మన్ కరుణాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *