డాక్టర్ హరి ప్రసాద్
గ్రేటర్ న్యూస్,వరంగల్ :తీవ్రమైన గుండె లేదా ఊపిరితిత్తుల వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషేంట్ల కోసం సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ అడ్వాన్స్డ్ ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO – ఎక్మో) సపోర్ట్ ను అందిస్తోందని యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ మెడిసిన్, డి ఎన్ బి (అనేస్తేసిలజీ ), ఎఫ్ ఎన్ బి (క్రిటికల్ కేర్ మెడిసిన్ ), ఎఫ్ సీసీ ఎస్(యూ ఎస్ ఏ )డాక్టర్. హరి ప్రసాద్ తెలిపారు.మంగళవారం హనుమకొండ లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…సాధారణ చికిత్సలు సరిపోనప్పుడు గుండె, ఊపిరితిత్తుల పనితీరుకు తాత్కాలికంగా మద్దతు ఇచ్చే ఒక అత్యాధునిక లైఫ్ సపోర్ట్ విధానమే ఈ ఎక్మో అని ఈ సాంకేతికత రక్తాన్ని ఆక్సిజనేట్ చేస్తుంది (రక్తంలో ఆక్సిజన్ నింపుతుంది).కార్బన్ డయాక్సైడ్ ను తొలగిస్తుందన్నారు .రక్తాన్ని తిరిగి శరీరంలోకి పంపింగ్ చేస్తుందని తద్వారా ముఖ్యమైన అవయవాలు తిరిగి కోలుకోవడానికి తగిన సమయం లభిస్తుందని తెలిపారు.
తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం, కార్డియోజెనిక్ షాక్, కార్డియాక్ అరెస్ట్, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతర గుండె,ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న పేషేంట్లకు, వారి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఎక్మోను పరిగణనలోకి తీసుకుంటారన్నారు.పేషేంట్ వైద్య అవసరాలను బట్టి, వీనో-వీనస్ (VV) ఎక్మో ప్రధానంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వైఫల్యానికి సపోర్ట్ ఇస్తుందని అదేవిధంగా, వీనో-ఆర్టీరియల్ (VA) ఎక్మో గుండె,ఊపిరితిత్తుల పనితీరు రెండింటికీ
మద్దతునిస్తుందన్నారు .ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషేంట్లు కోలుకోవడానికి, అవయవ మార్పిడి చేయడానికి లేదా ఖచ్చితమైన చికిత్స అందించడానికి ఒక వారధిలా కూడా ఎక్మోను ఉపయోగించవచ్చని అన్నారు.
“పేషేంట్ల గుండె, ఊపిరితిత్తులు కోలుకోవడానికి లేదా వారికి కచ్చితమైన చికిత్స అందించడానికి
ఎక్మో ఎంతో కీలకమైన సమయాన్ని అందిస్తుందని తెలిపారు.ఎక్మో చికిత్స విజయవంతం కావాలంటే
కేవలం టెక్నాలజీ ఉంటే సరిపోదని పేషేంట్కు సరైన సమయంలో ఏక్మో ఎంచుకోవడం, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, నిరంతర పర్యవేక్షణ, అలాగే ఇంటెన్సివిస్ట్లు, అనస్థీషియాలజిస్టులు, సర్జన్లు, నర్సులు, పర్వ్యూజనిస్ట్లు, ఇతర స్పెషలిస్ట్ల మధ్య సమన్వయం ఎంతో అవసరమని అన్నారు.ఈ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అవసరమైన రోగులకు 24 గంటల పాటు సమగ్రమైన క్రిటికల్ కేర్ అందించడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్లోలోని మా మల్టీడిసిప్లినరీ బృందం కట్టుబడి ఉందని డాక్టర్ హరి ప్రసాద్ తెలిపారు. 24×7 క్రిటికల్ కేర్ సేవలు, మల్టీడిసిప్లినరీ స్పెషలిస్టుల బృందంతో, సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషేంట్లకు సకాలంలో చికిత్స అందించడం వారి ఆరోగ్యాన్ని సమగ్రంగా నిర్వహించడంపై దృష్టి సారిస్తుందన్నారు . గుండె, ఊపిరితిత్తుల పనితీరుకు తాత్కాలికంగా మద్దతు ఇవ్వడం ద్వారా, శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను కొనసాగించడంలో ఎక్మో సహాయపడుతుందన్నారు.అదే సమయంలో పేషేంట్ కోలుకోవడానికి లేదా తదుపరి మెరుగైన చికిత్స అందించడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ మేనేజర్ పి. సంజీవ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

