Breaking
24 Aug 2026, Mon

క్యాన్సర్ చికిత్సా మెరుగైన సౌకర్యాలు…డాక్టర్ భరత్

గ్రేటర్ న్యూస్, హనుమకొండ :యశోద హాస్పిటల్లోని ఆంకాలజీ విభాగం సమగ్ర, రోగి-కేంద్రిత వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ చికిత్సను అందించడానికి కట్టుబడి ఉంది.
సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్
హెమటాలజిస్ట్ డాక్టర్ వాస్వాని భరత్ అన్నారు. శనివారం హనుమకొండ యశోద క్లినిక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వాస్వాని భరత్ మాట్లాడుతూ… ప్రతి రోగికినెక్స్ట్-జెనరేషన్ సీక్వెన్సింగ్ పరీక్షలు, ఫ్లో సైటోమెట్రీ ఇతర ప్రత్యేకమాలిక్యులర్ పరీక్షల ఫలితాల ఆధారంగా వ్యక్తిగతచికిత్స ప్రణాళిక రూపొందించబడుతుంది. ఈ పరీక్షలురోగికి అత్యంత ప్రభావవంతమైన చికిత్సను ఎంపికచేయడంలో సహాయపడతాయి.క్లిష్టమైన కేసులను క్రమం తప్పకుండా నిర్వహించేమల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ సమావేశాల్లోమెడికల్ ఆంకాలజిస్టులు, సర్జికల్ ఆంకాలజిస్టులు,రేడియేషన్ ఆంకాలజిస్టులు, పాథాలజిస్టులు,రేడియాలజిస్టులు ఇతర నిపుణులు కలిసిచర్చించి, ఉత్తమ చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు. ఆసుపత్రిలో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ,ఇమ్యూనోథెరపీతో పాటు, అవసరమైన రోగులకు
సెల్ థెరపీ వంటి ఆధునిక సెల్యులర్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రకాల క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారా యశోద
ఇప్పుడు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్
ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ వరంగల్ లో కూడ
అందుబాటులో కలరు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్లు రాజ్ కుమార్, నరేష్ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *