ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలతో సంగీతం విభావరి
సంగీతాభిమానులు హాజరై విజయవంతం చేయాలి
గ్రేటర్ న్యూస్,హనుమకొండ : గత రెండు సంవత్సరాలుగా వరంగల్ కళాకారులను ప్రోత్సహిస్తున్న ఐడల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రముఖ కళా, సామాజిక సంస్థ ఏకశిల కరోకే క్లబ్ సహకార సమర్పణలో పై కార్యక్రమం వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆడిటోరియం లో రేపు ( ఆదివారం ) ఉదయం 10 నుండి జరుగుతుందని ఐడల్ గంధర్వ అసోసియేషన్ వ్యవస్థాపకులు స్వర సామ్రాట్ డా. శరత్ చంద్ర , కార్యదర్శి లక్ష్మణ్ రావు, ఏకశిల కరోకే క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కూజా విజయ కుమార్, కార్యదర్శి ప్రగళ్లపాటి రాజ్ కుమార్ తెలిపారు.రేపు జరుగనున్న స్వరవైభవం కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో సంగీతాభిమానులు విచ్చేసి విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ముందుగా ఎంపిక చేసిన వరంగల్ గాయనీ గాయకులు ఘంటసాల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సినిమా పాటలు కరోకే మాధ్యమంలో ఆలపించనున్నారని వారు తెలిపారు.ఐడల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ తరపున ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రమ్య ప్రగడ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లో ప్రముఖ సంగీత విద్వాంసులు తిరుపతయ్య , ప్రముఖ కవి సిరాజుద్దీన్ , సినీ నిర్మాత, నటుడు, టీ ఎఫ్ సి సి ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల గణేష్ కూడా అతిథులుగా హాజరవుతారని తెలిపారు.కళలకు పేరెన్నిక గాంచిన వరంగల్ లో ప్రతిష్టాత్మకంగా జరపనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

