టీజేఏ ఆధ్వర్యంలో బాలింతలకు పండ్లు పంపిణీ…

గ్రేటర్ న్యూస్, వరంగల్ : తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ ఫౌండర్ ఉప్పల్ లక్ష్మణ్ , రాష్ట్ర అధ్యక్షులు రమణారావు  ఆదేశాల మేరకు 12వ టీజేఏ ఫౌండేషన్ డే సందర్భంగా వరంగల్ లోని సీకేఎం హాస్పిటల్ లో టీ జే ఏ వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో బాలింతలకు పండ్లను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా వరంగల్ జిల్లా టీజేఏ అధ్యక్షులు బొల్లెపల్లి రాజు మాట్లాడుతూ… జర్నలిస్టు సమస్యల సాధన కోసం, జర్నలిస్టుల అభివృద్ధి కోసం నిరంతరం ఉప్పల లక్ష్మణ్  ,రమణ పాటు పడుతు జర్నలిస్టులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ,వాళ్ళ సమస్యల సాధన కోసం సమస్యలు పరిష్కరించే కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా  తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ వరంగల్ జిల్లా యూనిట్ అండ్ జర్నలిస్టులు గణిపాక అనిల్, చిన్న పత్రికల జిల్లా అధ్యక్షులు అక్రమ్ , శ్రీనివాస్, భాస్కర్ విజయ్ కుమార్, మహేశ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *