Breaking
24 Aug 2026, Mon

క్యాన్సర్ పై మనోధైర్యమే గొప్ప ఆయుధం…డాక్టర్ రామకృష్ణ ప్రసాద్

గ్రేటర్ న్యూస్, వరంగల్ : క్యాన్సర్ వ్యాధిని
జయించడానికి మనోధైర్యమే అత్యంత కీలకమైన ఆయుధమని, దానికి మించిన వైద్యం మరొకటి లేదని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి అంకాలజీ నిపుణుడు డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండ యశోద సెంటర్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
యశోద ఆసుపత్రి రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అత్యాధునిక ‘హైపర్సైట్’ సాంకేతికత ద్వారా క్యాన్సర్ బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ అధునాతన టెక్నాలజీ ద్వారా కేవలం క్యాన్సర్ కణాలు ఉన్న భాగాలకు మాత్రమే అత్యంత
కచ్చితత్వంతో రేడియేషన్ అందిస్తారని, దీనివల్ల ఇతర శరీర భాగాలపై పడే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయని వివరించారు. ఈ హైపర్సైట్ పరికరం దేశంలోనే ప్రథమంగా ఒక్క సికింద్రాబాద్
యశోద ఆసుపత్రిలోనే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సాంకేతిక
పరిజ్ఞానంతో అనేక మంది క్యాన్సర్ బాధితులకు విజయవంతంగా చికిత్స అందించి నయం చేశామన్నారు. ఈ ఆధునిక వైద్య సౌకర్యాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యశోద ఆసుపత్రి అసిస్టెంట్ మేనేజర్ రాజకుమార్, నరేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *