అసాధారణ గుండె స్పందనలను నిర్లక్ష్యం చేయవద్దు
గ్రేటర్ న్యూస్,హనుమకొండ: గుండె వైఫల్యంతో బాధపడే రోగులలో గుండె పనితీరును మెరుగుపరిచేందుకు ప్రస్తుతం అత్యంత
అధునాతన, ప్రత్యేక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని ప్రముఖ కార్డియాలజీ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎమ్.ఎస్. చంద్రమౌళి తెలిపారు. సోమవారం హనుమకొండలోని యశోద క్లినిక్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన
మాట్లాడారు. యశోద హాస్పిటల్స్ లోని కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ విభాగం గుండె స్పందనల్లో వచ్చే అసాధారణ మార్పులను ముందే గుర్తించి, రోగుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందని
ఆయన వివరించారు. సమావేశంలో డాక్టర్ చంద్రమౌళి చికిత్సకు సంబంధించిన పలు ఆధునిక అంశాలను వెల్లడించారు. త్యాధునిక మ్యాపింగ్ సిస్టమ్ సహాయంతో ప్రాణాపాయ స్థితికి కారణమయ్యే గుండె స్పందనల వ్యాధులకు ఈ ప్రక్రియ ద్వారా ఖచ్చితమైన చికిత్స
అందించవచ్చు. సింగిల్ ఛాంబర్, డ్యూయల్ ఛాంబర్ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్లలో కండక్షన్ సిస్టమ్ పేసింగ్ వంటి సరికొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి వైర్లు (లీడ్స్) లేకుండా అమర్చే ఈ ఆధునిక పరికరం ఆకస్మిక గుండె మరణాల ప్రమాదాన్ని సమర్థవంతంగా నివారిస్తుంది. గుండె స్పందనల్లో వచ్చే తేడాలను
చాలామంది సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారని, అది ప్రమాదకరమని డాక్టర్ హెచ్చరించారు. “గుండె సమస్య తీవ్రమవడానికి ముందు తల తిరగడం, స్పృహ కోల్పోవడం, గుండె దడ లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇవి తీవ్రమైన రీతం (గుండె లయ) సమస్యలకు సంకేతాలు కావచ్చు” అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం
అత్యంత ముఖ్యమని సూచించారు. ఆధునిక ఎలక్ట్రోఫిజియాలజీ చికిత్సల ద్వారా ప్రస్తుతం చాలామంది రోగులు పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి పొందుతున్నారని చెప్పారు. యశోద హాస్పిటల్స్ ఎల్లప్పుడూ
ఇటువంటి అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు సేవలు అందిస్తోందని, “గుండె స్పందన సక్రమంగా ఉంటేనే జీవితం సురక్షితం.. ప్రతి గుండె స్పందనను కాపాడటమే మా బాధ్యత” అని డాక్టర్ చంద్రమౌళి స్పష్టం చేశారు.

