25 Feb 2026, Wed

మేడారం జాతర లో ప్లాస్టిక్ వాడకుండ పర్యావరణాన్ని రక్షించుకోవాలి…. మంత్రి సీతక్క

గ్రేటర్ న్యూస్, ములుగు / మేడారం :మేడారం జాతర లో ప్లాస్టిక్ వాడకూడదని పర్యావరణాన్ని రక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,  శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రజలకు సూచించారు.


ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం జాతర అటవీ ప్రాంతంలో ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,  శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా “ప్లాస్టిక్ ను వాడకండి. పర్యావరణాన్ని పరిరక్షించండి” అనే గోడపత్రికలను, “జాతరకు వచ్చే భక్తులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకండి”అనే కరపత్రాలను ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ… మేడారం జాతర కు వచ్చే భక్తులు అటవీ ప్రాంతం లో పర్యావరణాన్ని కాపాడుతూ,సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాస్, కవర్ల ను ఉపయోగించవద్దని అన్నారు. వాటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని అన్నారు.ప్లాస్టిక్ ప్లేట్స్ కవర్లలో వేడి, వేడి ఆహారం తీసుకోవద్దన్నారు. దానివల్ల జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం జాతరలో భక్తులు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకుండా గాలి, భూమి నీరు ను రక్షించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. , ఎస్పీ రామ్నాథ్ సుధీర్ కేకన్,డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ , ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, సభ్యులు రాముసేవక్, రవికాంత్,పస్రా సీఐ దయాకర్,అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *