జిల్లా అడ్మినిస్ట్రేషన్ – ట్రెజరరీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…
గ్రేటర్ న్యూస్,రెడ్ క్రాస్ సొసైటీ, సుబేదారి:ఆర్యోగంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా ఖజానా శాఖ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులను కాపాడేందుకు రక్తదానశిభిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిధిగా హనుమకొండ జిల్లా కలెక్టర్,రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చాహత్ బాజ్ పాయ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందచేయడం జరిగినది.
ఈ సందర్బంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ…
ఈ గొప్ప సేవా కార్యక్రమమైన రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన జిల్లా పరిపాలనకు అభినందనలు తెలిపారు. రక్తదానం అనేది మనం మానవత్వానికి అందించగల అత్యున్నత సేవలలో ఒకటని ఒక యూనిట్ రక్తం అనేక అమూల్యమైన ప్రాణాలను కాపాడగలదని తెలిపారు.ప్రత్యేకంగా వేసవి కాలంలో రక్త బ్యాంకుల్లో రక్తం కొరత ఎక్కువగా ఉంటుందని అదే సమయంలో అనేక మంది రోగులు నిరంతరం రక్తంపై ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా థలసీమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఆరోగ్యంగా జీవించడానికి తరచూ రక్త మార్పిడి అవసరం అవుతుందన్నారు . వారికి రక్తం అనేది కేవలం అవసరం మాత్రమే కాదని అది నిజంగా వారి ప్రాణాధారమని అన్నారు.ఈ సందర్భంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం అవసరమైన వారికి సమయానికి రక్తం అందేలా చూడడంలో ఎంతో ముఖ్యమైన, ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందన్నారు.రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవ నిజంగా మానవతా సేవగా నిలుస్తోందని తెలిపారు.రక్తదానం పూర్తిగా సురక్షితమైనది, సులభమైనదని మనం ఎవరో ఒకరి ప్రాణాన్ని కాపాడుతున్నామనే ఆనందం అపారమైన తృప్తిని ఇస్తుందన్నారు.కాబట్టి మనమంతా కలిసి రక్తదానంపై అవగాహన పెంచుతూ, ఎక్కువ మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా ప్రోత్సహిద్దామని తెలిపారు.
ఈ రక్తదాన శిబిరం లోహనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు: పుల్లూరు వేణుగోపాల్, బిళ్ళ రమణారెడ్డి, జిల్లా ఖజానా శాఖ అధికారి : అకవారం శ్రీనివాస్ కుమార్, టి. ఎన్. జి. ఓ. ప్రెసిడెంట్ : ఆకుల రాజేందర్, టి. జి. ఓ. రాష్ట్ర ఉపాధ్యక్షుడు : జగన్ మోహన్ రావు, ఉద్యోగ సంఘ నేతలు : బైరి సోమయ్య, డా. ప్రవీణ్, రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, కోలా రాజేష్ కుమార్, మాధవ రెడ్డి, లక్ష్మి ప్రసాద్, విజయలక్ష్మి, కిరణ్, శ్యామ్ సుందర్, ఫణికల రాజేష్, యం. ఆర్. ఓ లు : బావు సింగ్, జగన్ మోహన్ రెడ్డి, ఖజానా శాఖ సిబ్బంది : శ్రీనివాస్ రెడ్డి, అన్వర్, చంద్ర శేఖర్, దయాకర్, ప్రసాద్, ఉదయ్ భాస్కర్ మరియు ఉద్యోగ సంఘాలు పెద్దఎత్తున పాల్గొని రక్తదానం శిబిరం దిగ్విజయం చేశారు.

