Breaking
30 Aug 2026, Sun

పదోన్నతి పొందుటకు అర్ముడ్ రిజర్వ్ పోలీసుల ప్రీ ప్రమోషనల్ శిక్షణ ముగింపు…

గ్రేటర్ న్యూస్, వరంగల్ :మామూనూర్  4వ బెటాలియన్ లో సోమవారం పదోన్నతి పొందుటకు అర్ముడ్ రిజర్వ్ పోలీసుల ప్రీ ప్రమోషనల్ శిక్షణ ముగింపు కార్యక్రమంకు అసిస్టెంట్ కమాండెంట్ ఇ.వీరన్న ముఖ్య అతిధిగా హాజరైనారు. తెలంగాణ అర్ముడ్ పోలీస్ విభాగానికి చెందిన అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్,సబ్ ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతి పొందుటకు 52 మంది అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కి 4వారాలపాటు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలో భాగంగా అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కి ఎక్సట్రీమిసం & డిజాస్టర్ మేనేజ్మెంట్,విఐపి సెక్యూరిటీ, గార్డ్స్ అండ్ ఎస్కార్ట్స్ (టిఎస్పిఎం),క్రిమినల్ మేజర్ యాక్ట్స్ (బిఎన్ఎస్,బిఎన్ఎస్ఎస్ & బిఎస్ఎ),లీడర్షిప్ & మేనేజ్మెంట్ అంశాలపై నిష్ణాతులైన శిక్షకులచే శిక్షణను ఇచ్చామని అసిస్టెంట్ కమాండెంట్ ఇ.వీరన్న తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐలు కార్తిక్,రవి, సర్వర్, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, క్రిష్ణ,  శిక్షణార్థులు, బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *