మేడారం జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యం :వై. నాగిరెడ్డి

గ్రేటర్ న్యూస్, ములుగు/మేడారం : శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం, అధిక బస్సులను ఏర్పాటు చేయడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్నారు. మంగళవారం తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఐపీఎస్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యాల దృష్ట్యా మేడారం ఆర్టీసీ బస్ స్టాండ్, బస్సుల ప్రాంగణం, ప్రయాణికుల వేచి ఉండే ప్రదేశాలు, శుభ్రత, తాగునీటి సౌకర్యాలు తదితర ఏర్పాట్లకు సంబందించిన ప్రణాళికను పరిశీలించి ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మేడారం జాతర కోసం 28 ఎకరాల సువిశాల ప్రదేశంలో బస్టాండ్ ఏర్పాటు, క్యూలైన్స్ , భక్తులు వేచి ఉండే గదులు , తదితర నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 25 తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, విధులలో డ్రైవర్లు కండక్టర్లు టెక్నికల్ అధికారులు ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా చూడాలని మెరుగైన రవాణా సేవలు అందించాలని అధికారులను సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…గత జాతరలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మేడారం వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం , బస్సుల ఏర్పాటు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. తాడ్వాయి నుంచి మేడారం చేరుకునే అటవీ మార్గం మధ్యలో సిగ్నల్ సమస్య ఉండటంతో కమ్యూనికేషన్ కోసం ప్రతి కిలోమీటర్ కు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

అనంతరం శ్రీ సమ్మక్క సారమ్మ వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఆర్టీసి ఈడిఎం మునిశేఖర్, ఈడి వెంకన్న, ఈడి సాల్మన్, ఆర్ఎం విజయ భాను, ఆర్ఎం రవి చంద్ర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *