Breaking
16 Jul 2026, Thu

గద్దెలకు సమ్మక్క రాక సందర్భంగా వివిధ వేషధారణలతో భక్తులు…

గ్రేటర్ న్యూస్, ములుగు/ మేడారం: మేడారం వన దేవతల జాతరలో గద్దెలకు సమ్మక్క రాక సందర్భంగా భక్తులు అపూర్వ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సంప్రదాయ వేషధారణలు, దేవతా స్వరూపాలతో జాతర ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ, డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలతో అమ్మవారిని స్మరిస్తూ పాల్గొనడం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల హర్షాతిరేక నినాదాలతో మేడారం ప్రాంతం భక్తి మయంగా మారింది.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. భక్తులు సహకరించి శాంతి యుతంగా దర్శనాలు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *