Breaking
27 Mar 2026, Fri

కోకాపేటలో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : వైద్యం యాంత్రికం గా ఉండొద్దు అన్నది వైద్యులకు నా సూచన అని ప్రజలకు మానవత్వంతో కూడిన వైద్య సాయం అందించడం ప్రతి వైద్యుడు కర్తవ్యం గా భావించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం  కోకాపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికవర్ ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర రాజనర్సింహ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….

నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలని విద్యావ్యవస్థలో పలు మార్పులు తెస్తున్నమని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితం గా లేదా 50 శాతం రాయితీతో రవాణా సౌకర్యం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆడబిడ్డల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని మహిళల ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందన్నారు.65 లక్షల మంది హెల్త్ డేటా ను తయారు చేస్తున్నామని వాళ్ళకి డిజిటల్ హెల్త్ కార్డ్ ఇస్తామన్నారు.గత 20 ఏళ్ల ఆరోగ్య శ్రీ డేటా ను విశ్లేషించి హెల్త్ డేటా తయారు చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని డాక్టర్ నోరి దత్తాత్రేయను సలహా దారుడిగా నియమించామని ఆరోగ్య శ్రీ, CMRF కోసం 1800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు .ఉస్మానియా, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం 10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రైవేట్ రంగం లో ఉన్న డాక్టర్ లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *