Breaking
30 Aug 2026, Sun

అంగన్వాడీ టీచర్ లకు కొత్త ఫోన్లు!

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోషణ్ ట్రాకర్ ద్వారా అంగన్వాడీ వివరాలను అప్డేట్ చేసేందుకు ఇదివరకే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పాతబడిపోవడంతో.. కొత్త ఫోన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పది రోజుల్లోనే సీఎం రేవంత్ ఆ ఫోన్లను అందజేయనున్నట్లు సమాచారం. కొత్తగా 4G ర్యామ్, 64GB మెమొరీ సామర్థ్యం ఉన్న ఫోన్లను ఇవ్వనున్నారు. అంగన్వాడీ టీచర్ ప్రతిరోజు ఫోన్‌లో పోషణ్ ట్రాకర్ యాప్‌లో 14 రకాల వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *