Breaking
30 Aug 2026, Sun

భద్రకాళీ అమ్మవారికి లక్ష మల్లె పూలతో పుష్పార్చన…

గ్రేటర్ న్యూస్, వరంగల్ : మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్ర మహెూత్సవములు మూడవ రోజుకు చేరుకున్నాయి. మూడవ రోజు కార్యక్రమాలలో భాగంగా శనివారం ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరుపడిన పిమ్మట కల్పోక్త ప్రకారం వసంత నవరాత్ర ఉత్సవాల సందర్భంగా జరుపవలసిన విశేష జపహెూమార్చనాభిషేకములు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లక్ష మల్లె పూలతో అర్చన జరిపి అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. లక్ష పుష్పార్చన కార్యక్రమానికి వరంగల్ ప్రముఖ న్యాయవాది  భాస్కరవజ్ఞుల పురుషోత్తం-భవానీ దంపతులు వ్యవహరించారు.శనివారం సెలవుదినం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయమును సందర్శించిన భక్తులకు సరిపడు ప్రసాదములు, మంచినీటి సౌకర్యం, క్యూలైన్లు తదితర ఏర్పాట్లు ధర్మకర్తలు  తొనుపునూరి వీరన్న,  గాదె శ్రవణకుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్,  గాండ్ల స్రవంతి, బింగి సతీష్, తదితరులు పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *