Breaking
24 Aug 2026, Mon

శాకంభరీగా భద్రకాళీ అమ్మవారు….

నేటితో ముగిసిన నవరాత్రులు…

గ్రేటర్ న్యూస్, వరంగల్ : శ్రీ భద్రకాళీ దేవస్థానంలో గత పదిహేను రోజులుగా జరుగుతున్న రా కంతా దీక్షా పూర్వక శాకంభరీ నవరాత్రులు నేటితో ముగిశాయి. ఈ రోజు పదిహేనవ రోజు ఆషాడ శు। పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంభరిగా అలంకరించి పూజారాధనలు జరిపారు. ఉదయం గం|| 10-00లకు అమ్మవారి దర్శనానికి దేవస్థానం వారు అనుమతించగానే కట్టలు తెంచుకున్న ఆనందంతో గుడిలోపలికి వచ్చి శాకంభరీ అలంకారములో ఉన్న అమ్మవారిని దర్శించుకొని పులకించిపోయారు. దేవస్థానం ప్రాంగణం అంతా భద్రకాళి శరణం మమ: శాకంభరీ శరణం మమ :అనే నామ స్మరణతో మారుమ్రోగింది. ఆలయ ఈఓ రామల నునీత పోలీసు ప్రభుత్వ శాఖల సమన్వయంతో జరిపిన ఏర్పాట్లు భక్తుల ప్రశంసలకు పాత్రమయ్యాయి. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 4000 కిలోల కూరగాయలు, పండ్లు సేకరించి దండలుగా చేసి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం గం|| 03-00లకు ప్రారంభమైన అమ్మవారి శాకంభరీ అలంకరణ గం|| 9-30వరకు సాగింది. గం|| 10-00లకు పూజానంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారి అలంకరణకు కావలసిన కూరగాయలు, పండ్లు నిన్న సాయంకాలం గం|| 06-00ల నుండి భక్తులు నుదిగా గుడికి చేరుకొని అర్చకుల సూచనల స్వీకరిస్తూ దండలుగా చేసి ఇచ్చారు. నిన్న రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కజేయకుండా భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *