Breaking
26 Mar 2026, Thu

పాలకుర్తి పరిసరాలలో ఎల్లమ్మ సినిమా షూటింగ్- ప్రొడక్షన్ మేనేజర్ డాక్టర్ మేడారపు సుధాకర్

గ్రేటర్ న్యూస్,పాలకుర్తి : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బలగం వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా నిర్మించబోతున్న ఎల్లమ్మ సినిమాను పాలకుర్తీ పరిసరాలలోని కొండాపురం, వల్మిడీ, కోలన్ పల్లి కొండ ప్రాంతాలలో చిత్రికరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎల్లమ్మ సినిమా ప్రొడక్షన్ మేనేజర్ డాక్టర్ మేడారపు సుధాకర్ తెలిపారు.పాలకుర్తీ పరిసర ప్రాంతాలలో ఎల్లమ్మ షూటింగ్ లొకేషన్ ల కోసం దర్శకుడు బలగం వేణు, కబాలి, ఖుషి, సరిపోదా శనివారం సినిమాల కెమెరామన్ జి. మురళి వర్ధన్, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు మంగళవారం, బుధవారం రెండు రోజులు పరిశీలించారు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఎల్లమ్మ సినిమా షూటింగ్ చారిత్రక నేపథ్యం కలిగిన పాలకుర్తీ లో చిత్రీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు , పాలకుర్తీలోని సహజ నటులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు, మేనేజర్స్ రవి, సత్య, డాక్టర్ తాళ్లపెల్లి నరేష్ లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *