Breaking
30 Aug 2026, Sun

ఎన్ ఎస్ ఎస్ యూనిట్లు I & II ఆధ్వర్యంలో సామాజిక సేవ, ఆరోగ్యం పై అవగాహన

గ్రేటర్ న్యూస్,హనుమకొండ : కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎన్ ఎస్ ఎస్ యూనిట్లు I & II ఆధ్వర్యంలో సామాజిక సేవ, ఆరోగ్య అవగాహన, గ్రామ అభివృద్ధి లక్ష్యాలతో గుండ్లసింగారం గ్రామంలో ఏడు రోజుల ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభ సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో భాగంగా సోమవారం శరత్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల కోసం ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించబడింది. గుండ్లసింగారం గ్రామానికి చెందిన అనేక మంది ప్రజలు పాల్గొని తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించించుకున్నారు.
ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి అవసరాన్ని వివరించారు.అనంతరం
గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి వేణు సభను ఉద్దేశించి ఎన్ ఎస్ ఎస్ శిబిరం వివరాలను వివరించారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు,సమాజ సేవా భావన పెంపొందించడంలో ఈ శిబిరాల ప్రాధాన్యతను ఆయన వివరించారు.అనంతరం అమరుల జ్ఞాపకార్థం షహీద్ దివస్ పాదయాత్ర (ర్యాలీ) నిర్వహించబడింది. ఈ ర్యాలీలో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి, సామాజిక బాధ్యతను ప్రతిబింబించారు.
ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ ఈ. నారాయణ (ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త), కందుకూరి రవి (ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు), చి. హెచ్. అన్వేష్ (మై భారత్ డిగ్రీ డైరెక్టర్), ప్రొఫెసర్ ఎన్. రమణ (ప్రిన్సిపాల్, కుసెట్ ), డా. డి. శైలజ , డా. ఎం. సౌజన్య (ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు) పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *