Breaking
16 Jul 2026, Thu

జర్నలిస్టు పూజారి విజయ్ అదృశ్యం…

ఆచూకీ తెలిసిన వారు 9652988566 నెంబర్ కు సమాచారం ఇవ్వలగలరు…

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : హనుమకొండ గొల్లపల్లి కృష్ణ కాలనీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పూజారి విజయ్ కుమార్ అదృశ్యమయ్యారు. వరంగల్ నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులతో కలిసిమెలిసి ఉన్న ఆయన నిన్నటి నుంచి కనిపించడం లేదు. మంగళవారం ఉదయం 10:30 సమయంలో ఆయన సెల్ స్విచ్ ఆఫ్ అయింది. బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికిన ఆయన ద్విచక్ర వాహనం TS 03 EU 2731 బ్లూ కలర్ గ్లామర్ ,విజయ్ కుమార్ ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం ఈ విషయంపై కుటుంబ సభ్యులు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జర్నలిస్టు విజయ్ కుమార్ ఆచూకీ లభించినట్లయితే అతని తమ్ముడు పూజారి శ్రీనివాస్ సెల్ నెంబర్ 9652988566 కు సమాచారం ఇవ్వాలని ఆయన సతీమణి పూజారి సుజాత విజ్ఞప్తి చేశారు. తన భర్త అదృశ్యం మిస్టరీని ఛేదించాలని పోలీస్ అధికారులను ఆమె కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *