గ్రేటర్ న్యూస్,హనుమకొండ : ఊపిరితిత్తులు, అన్నవాహిక, ఛాతీ మధ్యభాగం, డయాఫ్రమ్, ఛాతీ గోడకు సంబంధించిన సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో మినిమల్లీ ఇన్వాసివ్, రోబోటిక్ సర్జరీలు కీలకంగా మారుతున్నాయని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి సి తెలిపారు.గురువారం హనుమకొండ యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ, రోబోట్ అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ వంటి ఆధునిక పద్ధతులతో చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో నొప్పి, ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గడంతో పాటు రోగులు త్వరగా సాధారణ జీవనానికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.గత దశాబ్దంలో ఛాతీ శస్త్రచికిత్సల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని అన్నారు. చిన్న కోతలు, రోబోటిక్ సాంకేతికతతో సంక్లిష్టమైన వ్యాధులకు కూడా మరింత కచ్చితత్వంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వ్యాధిని ముందుగానే గుర్తించడం, ఆధునిక సర్జరీ నైపుణ్యాలు, వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. థొరాసిక్ సర్జన్లు, పల్మనాలజిస్టులు,ఆంకాలజిస్టులు,రేడియాలజిస్టులు,అనస్థీషియాలజిస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం ఆధ్వర్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక వ్యాధులు, ఛాతీ కణితులు తదితర సమస్యలకు సమగ్ర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎండేజ్ ఊపిరితిత్తుల వ్యాధులతో
బాధపడుతున్న వారికి అధునాతన ఊపిరితిత్తుల మార్పిడి సేవలను కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు.సాంకేతికతతో కూడిన వైద్యం, నిపుణుల బృందం, ఆధునిక క్రిటికల్ కేర్ సదుపాయాలతో రోగులకు మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

