మోకాలి మార్పిడిలో రోబోటిక్ విప్లవం…

వైద్య రంగంలో సరికొత్త ముందడుగు..
సర్జన్ అనుభవానికి ఆధునిక సాంకేతికత జోడింపు..
గ్రేటర్ న్యూస్, వరంగల్ : మోకాళ్ల నొప్పులతో తీవ్ర అవస్థలు పడుతున్న ఆర్థరైటిస్ రోగులకు వైద్య సాంకేతికతలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వైద్య రంగంలోకి ప్రవేశించిన ఆధునిక రోబోటిక్ టెక్నాలజీ, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలలో విప్లవాత్మక మార్పులు
తీసుకువస్తోందని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్కు చెందిన ప్రముఖ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స, ఆర్థ్రోస్కోపీ, ట్రామా నిపుణులు డాక్టర్ అభిషేక్ బర్లీ తెలిపారు. హనుమకొండ యశోద హాస్పిటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల్లో తనకు 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉందని, ఆధునిక రోబోటిక్-అసిస్టెడ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ విధానం ద్వారా శస్త్రచికిత్సను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చని
ఆయన స్పష్టం చేశారు. రోబోటిక్ శస్త్రచికిత్సపై సాధారణ ప్రజల్లో ఉన్న పలు అనుమానాలను డా. బర్లీ నివృత్తి చేశారు. “రోబోట్ అనేది కేవలం సర్జన్ చేతిలో ఒక అత్యంత ఖచ్చితమైన సాధనం మాత్రమే. రోబోట్
స్వతంత్రంగా ఆపరేషన్ చేయదు. శస్త్రచికిత్స అంతా అనుభవజ్ఞుడైన సర్జన్ నియంత్రణలోనే జరుగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రోగి మోకాలి శరీర నిర్మాణం ఒకేలా ఉండదు. సాధారణ పద్ధతుల్లో
వాడే కొలతల కంటే, రోబోటిక్ సాంకేతికత ద్వారా రోగి ప్రత్యేక శరీర నిర్మాణానికి అనుగుణంగా శస్త్రచికిత్స ప్లాన్ రూపొందించుకోవచ్చు. ఆపరేషన్ సమయంలో రియల్టైమ్లో ఎముకల కటింగ్, ఇంప్లాంట్ పొజిషనింగ్, లిగమెంట్ బ్యాలెన్స్, మోకాలి అలైన్మెంట్లలో అత్యంత
సున్నితమైన మార్పులు చేసేందుకు ఈ సాంకేతికత ఉపకరిస్తుంది. ప్రతి రోగి శరీర నిర్మాణానికి తగిన ప్రత్యేక ప్రణాళిక, ఆపరేషన్ సమయంలో సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ అంచనా వేసే వీలు. ఎముకల కటింగ్, ఇంప్లాంట్
పొజిషనింగ్లో పొరపాట్లకు తావులేకపోవడం. సరిగ్గా ఎంపిక చేసిన రోగులలో త్వరగా సాధారణ జీవితానికి తిరిగొచ్చే అవకాశం ఉంటుంది. “కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా, సరైన రోగి ఎంపిక, సర్జన్ నైపుణ్యం, నాణ్యమైన ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స అనంతర ఫిజియోథెరపీలు
విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని డా.బర్లీ వివరించారు. వరంగల్, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం, ఇకపై ప్రతి నెల మొదటి ఆదివారం డాక్టర్ అభిషేక్ బర్లీ వరంగల్ యశోద మెడికల్ సెంటర్లో అందుబాటులో ఉంటారని వెల్లడించారు. దీనివల్ల కీళ్ల
మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు తదుపరి ఫాలో-అప్ లేదా వైద్య సలహాల కోసం ప్రతిసారి హైదరాబాద్ వెళ్లాల్సిన పనిలేకుండా, సొంత ఊరిలోనే నిపుణుల సేవలు పొందే వెసులుబాటు లభించింది. ఈ
కార్యక్రమంలో హాస్పిటల్స్ అసిస్టెంట్ మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *