మోకాళ్ల నొప్పులు ఇంజెక్షన్లతో తగ్గుతాయనేది అపోహే : డాక్టర్ వినయ్ కుమార్

అసత్య ప్రచారాలు నమ్మి మోసపోవద్దు
గ్రేటర్ న్యూస్,హనుమకొండ: మోకాళ్ల నొప్పులు కేవలం
ఇంజెక్షన్లతోనే పూర్తిగా నయమవుతాయనేది కేవలం అపోహ మాత్రమేనని, అలాంటి అసత్య ప్రచారాలను నమ్మి బాధితులు మోసపోవద్దని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వినయ్ కుమార్ స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా
కేంద్రంలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కీళ్ల మార్పిడి, రోబోటిక్ సర్జరీలపై నిర్వహించిన వైద్యుల మీడియా సమావేశంలో ఆయన హనుమకొండ యశోద హాస్పిటల్ సెంటర్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ… ప్రస్తుత జీవనశైలి కారణంగా మోకాళ్లు, కీళ్ల నొప్పుల బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. సికింద్రాబాద్
యశోద హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యంత ఆధునిక రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా మోకాలి జాయింట్లను ఎలాంటి వంకర లేకుండా 100 శాతం ఖచ్చితత్వంతో సరిచేయవచ్చని తెలిపారు. సర్జన్ల నైపుణ్యానికి రోబోటిక్ సాంకేతికత తోడుకావడం వల్ల ఎముక కోతలు, రక్తస్రావం, నొప్పి చాలా తక్కువగా
ఉంటాయని… శస్త్రచికిత్స జరిగిన రెండు రోజుల్లోనే రోగి స్వయంగా నడవవచ్చని వెల్లడించారు. నాణ్యమైన, ఎక్కువ కాలం మన్నికగా ఉండే ‘ఆక్సినియం ఇంప్లాంట్స్’, మెటల్ సిరామిక్ పరికరాలనే వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే హిప్, షోల్డర్ రీప్లేస్మెంట్
పాటు క్రీడాకారుల గాయాలకు (స్పోర్ట్స్ ఇంజూరీస్) ఉదయం చికిత్స చేసి సాయంత్రానికే డిశ్చార్జ్ చేసేలా ‘డే-కేర్’ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కీళ్ల సమస్యలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా ఆధునిక రోబోటిక్ చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ విభాగానికి చెందిన స్వరాజ్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *