తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45మంది ఐఏఎస్ ల బదిలీలు
గ్రేటర్ న్యూస్, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా బదిలీ ఉత్తర్వుల మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న చాహత్ బాజ్‌పాయ్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్ గా నియమించింది.ప్రస్తుతం ఆమె గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న స్నేహా శబరీష్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా బదిలీ కావడంతో ఆ స్థానంలో చాహత్ బాజ్‌పాయ్‌ను ప్రభుత్వం నియమించింది.అదేవిధంగా, హనుమకొండ జిల్లా కలెక్టర్ బాధ్యతలతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ పదవిని అదనపు బాధ్యతలుగా కొనసాగించనున్నారు.ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్బంగా నూతన కలెక్టర్ కు అధికారులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

