ఎక్మోతో ఊపిరితిత్తుల మార్పిడికి కొత్త ఆశలు : డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ

గ్రేటర్ న్యూస్,హనుమకొండ: తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న రోగులకు ఎక్కో విధానం ప్రాణాధారంగా నిలుస్తోందని హైదరాబాద్
సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ట్రాన్సాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ తెలిపారు. హనుమకొండ యశోద సెంటర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… చివరి దశ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న తగిన రోగులకు ఎక్కో సహాయంతో ఊపిరితిత్తుల మార్పిడి చేసే అవకాశాలు, ఈ చికిత్సలో ఆధునిక వైద్య సాంకేతికత ప్రాధాన్యత గురించి వివరించారు. చివరి దశ ఇంటరీషియల్ లంగ్ డిసీజ్ లేదా తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కారణంగా ఊపిరితిత్తులు శరీరానికి సరిపడా ఆక్సిజన్ ను అందించలేని పరిస్థితుల్లో వెనో-వీనస్ ఎక్మో చికిత్సను తపస్వి వివరించారు. ఈ విధానంలో శరీరం వెలుపల ఏర్పాటు చేసిన ప్రత్యేక
యంత్రం కృత్రిమ ఊపిరితిత్తుల మాదిరిగా పనిచేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచి, కార్బన్ డయాక్సైడ్ను తొలగించి, ఆ రక్తాన్ని తిరిగి శరీరంలోకి పంపిస్తుంది.
ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైన ఎంపిక చేసిన రోగులకు దాత ఊపిరితిత్తులు లభించే వరకు ప్రాణాధార సహాయం అందించడంలో ఎక్మో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ విధానాన్ని వైద్య పరిభాషలో ‘బ్రిడ్జ్ టు ట్రాన్స్ ప్లాంట్’ అని పిలుస్తారని పేర్కొన్నారు. ఎక్కో సహాయంతో
రెండు ఉపయోగించవచ్చని డాక్టర్ ఉన్న రోగులకు
ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని డాక్టర్ తపస్వి
తెలిపారు. గుండె ఊపిరితిత్తుల నిపుణులు,
మత్తుమందు వైద్యులు, అత్యవసర చికిత్సా విభాగం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయడం ఈ చికిత్సలో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చివరి దశ
ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని, తగిన వైద్య పరీక్షల అనంతరం ఊపిరితిత్తుల మార్పిడి ద్వారా మెరుగైన జీవనావకాశాలు కల్పించవచ్చని తెలిపారు.
శస్త్రచికిత్స అనంతరం నిరంతర వైద్య పర్యవేక్షణలో
రోగి కోలుకునేలా ఎక్కో, వెంటిలేటర్ సహాయాన్ని దశలవారీగా తగ్గిస్తూ పునరావాస కార్యక్రమాల ద్వారా సామాన్య జీవితానికి అలవాటు పడేలా సహాయం అందిస్తారని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో
యశోద హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ – మెడికల్ సర్వీసెస్ డాక్టర్ జీవన్ ఏ, మార్కెటింగ్ మేనేజర్ పి.సంజీవ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *