రంజిత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభినందించిన హరీష్ రావు…
గ్రేటర్ న్యూస్, హనుమకొండ : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.బిఆర్ఎస్ యూత్ నాయకులు రెడ్డిపురం రంజిత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం బాలసముద్రంలోని బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, బ్యాగ్స్ ను పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై విద్యార్థులకు ఆర్థిక సహాయం, బ్యాగ్ లను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ పార్టీ కష్టకాలం లో తోడుగా ఉన్న ప్రతి కార్యకర్తని కాపాడుకుంటామని ప్రతిపక్ష పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన పార్టీ పరంగా మీము మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు . కష్టాల్లో ఉన్న పార్టీ కార్యకర్తల పిల్లల కోసం సుమారు 550 మంది పైగా విద్య సహాయం వారి చదువు కోసం ఇంత పెద్ద ఎత్తున సహాయం చేస్తున్న రంజిత్ రెడ్డి ని అభినందిచారు.భవిషత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ,పార్టీ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటామని మాట్లాడారు. పెద్దఎత్తున తరలివచ్చిన యువత ని ఉద్దేశించి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… ఇంత పెద్ద ఎత్తున పేద పిల్లల చదువుల కోసం సహాయం చేస్తున్న రంజిత్ రెడ్డి ని అభినందించారు.. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ,మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి ,అరూరి రమేష్ ,మాజీ రాష్ట్ర చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్ ,లింగంపల్లి కిషన్ రావు ,మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి ,రాష్ట్ర నాయకులు సాంబరి సమ్మరావు ,హరి రమాదేవి,మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రంజిత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



