హనుమకొండలో కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం

గ్రేటర్ న్యూస్, హనుమకొండ : ఖాతాదారులకు ఆధునిక బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యమని కాస్మోస్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సచిన్ ఆప్టే అన్నారు. హనుమకొండ కిషన్ పుర లో కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ నూతన శాఖను శనివారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఆధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వరంగల్, హనుమకొండ, కాజీపేట లో బ్యాంకు కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ శాఖ కీలకంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కాస్మోస్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సచిన్ ఆప్టే, వైస్ చైర్మన్ సీఏ యశ్వంత్ కుమార్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్తి ధోలే, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బ్యాంకుకు విస్తృతమైన శాఖల నెట్వర్క్ ఉందని నిర్వాహకులు తెలిపారు.వరంగల్ ట్రైసిటీ బ్యాంకింగ్ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు నూతన కార్యాలయం హనుమకొండలో నూతన శాఖ ప్రారంభంతో త్రీ నగరంలోని మరింత మంది ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన, ఆధునిక బ్యాంకింగ్ సేవలు అందించడమే తమ లక్ష్యమని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం గౌతమ్ రాయ్, హనుమకొండ బ్యాంకు ఇన్చార్జ్ సతీష్ కుమార్, సీనియర్ ఆఫీసర్ కె.చేతన్ కుమార్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *