Breaking
27 Mar 2026, Fri

భద్రకాళీ చెరువు పూడికతీత పనులకు శ్రీకారం…

ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని , నగర మేయర్  గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
▪️ రూ.16.10 కోట్లతో పూడిక తీత పనుల ప్రారంభం….
▪️మే 15 లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం….


గ్రేటర్ న్యూస్, హనుమకొండ : భద్రకాళీ చెరువు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టినట్లు వరంగల్ (పశ్చిమ) ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ లు తెలిపారు.99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు కలెక్టర్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే నాయిని , మేయర్, కలెక్టర్ హాజరై పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని , వరంగల్ నగర అభివృద్ధిలో కీలకమైన భద్రకాళి చెరువు పునరుద్ధరణ చేసి మరో పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామని అన్నారు. గతంలో రూ. 9 కోట్ల అంచనా వ్యయం తో ప్రారంభించిన పూడికతీత పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ప్రస్తుతం రూ.16.10 కోట్ల నిధులతో సమగ్రంగా చెరువు పూడికతీత పనులను చేపడుతున్నామని తెలిపారు.అమ్మవారి ఆశీస్సులతో ఎలాంటి అవాంతరాలు లేకుండా చెరువు పునరుద్ధరణ, మాఢ వీధుల నిర్మాణ పనులు చేపడుతున్నామని,అభివృద్ధి పనులలో ఎక్కడ రాజీ పడడం లేదని,సమష్టి నాయకత్వంతో వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.భద్రకాళి చెరువు సుందరీకరణ ప్రక్రియ లో భాగంగా ఆలయం నుంచి బండ్ వైపు గ్లాస్ వంతెన ఏర్పాటు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. దేశం నలుమూలల నుండి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, గతంలో 70 ఏళ్ల క్రితం పూడికతీత పనులు జరిగాయని ఎమ్మెల్యే నాయిని తెలిపారు.భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులు ప్రస్తుత ప్రభుత్వ హయాం లో జరగడం తాను ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇట్టి పనులను మే 15 లోగా సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీత పనులను పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ లు దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, మామిండ్ల రాజు, ఇరిగేషన్ ఎస్ ఈ రాంప్రసాద్, ఈ ఈ కిరణ్ కుమార్ కుడా ఈ ఈ భీమ్ రావు, ఇరిగేషన్ డి ఈ మధుసూదన్, ఏ ఈ లు వేణు గోపాల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *