Breaking
24 Aug 2026, Mon

100 కు గుడ్ బై! ఎమర్జెన్సీకి కొత్త నెంబర్ 112

గ్రేటర్ న్యూస్,హైదరాబాద్ (ఆగస్టు 05) :
తెలంగాణలో అత్య వసర సేవల కోసం ఇకపై డయల్ 100 స్థానంలో 112 నెంబర్ అందుబాటు లోకి వచ్చింది, పోలీస్ సహాయం అంబులెన్స్, అగ్నిమా పక సేవలు వంటి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు.

ఇక నుండి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఒకే నెంబర్ ను ఉప యోగించుకోవచ్చు, ఇందుకోసం తెలంగా ణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ డీజీపీ సీవీ ఆనంద్, ఈ నూతన ఎమర్జె న్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ నంబర్‌ను బుధవారం అధికారి కంగా ప్రారంభించా రు.

ఇకనుండి వేర్వేరు నెంబర్లను గుర్తించు కోవాల్సిన అవసరం లేకుండా బాధితులు ఇకపై 112′ కు కాల్ చేస్తే సరిపోతుంది. కాల్ వచ్చిన వెంటనే సంబంధిత విభాగా నికి పోలీస్, ఫైర్ లేదా మెడికల్ సమాచారా న్ని వేగంగా చేరవేసి, లొకేషన్ ఆధారంగా వేగంగా సహాయం అందించేలా ఈ సిస్టమ్‌ను డిజైన్ చేశారు.

ఆపదలో ఉన్న మహిళలు, వయో వృద్ధులు, పిల్లల అత్యవసర రక్షణ కోసం ఈ సిస్టమ్‌ను సరికొత్త టెక్నాలజీతో అనుసంధానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *