తీవ్రమైన న్యుమోనియాతో ప్రాణాపాయ ఏఆర్డీఎస్…

మహిళకు యశోదా వైద్యుల చికిత్స విజయవంతం

గ్రేటర్ న్యూస్ , హనుమకొండ : కొన్ని రోజులుగా జ్వరం కొనసాగుతూ, ఆయాసం పెరుగుతుంటే సాధారణ ఇన్ఫెక్షన్గా భావించి నిర్లక్ష్యం చేయకూడదని మలక్పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు
హెచ్చరించారు. తీవ్రమైన న్యుమోనియా రెండు
ఊపిరితిత్తులను ప్రభావితం చేసి రక్తంలోకి ఆక్సిజన్
చేరే ప్రక్రియను దెబ్బతీసి, ప్రాణాపాయకరమైన
‘అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్’, శ్వాస
వైఫల్యానికి దారితీస్తుందని తెలిపారు. ఇలాంటి
అత్యంత క్లిష్టమైన పరిస్థితితో ఆసుపత్రికి
వచ్చిన మధ్య వయస్సు మహిళకు వైద్యులు
విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు
కాపాడారు. బాధిత మహిళ వారం రోజులుగా
విడతలవారీగా జ్వరం, తలనొప్పి, రెండు
రోజులుగా గ్రేడ్-3 ఆయాసం, ఒకరోజుగా నడుము
పక్కభాగంలో నొప్పితో ఆసుపత్రికి వచ్చారు. వైద్య
పరీక్షల్లో ఆమెకు రెండు ఊపిరితిత్తుల్లో తీవ్రమైన
‘కమ్యూనిటీ అక్వైర్డ్ న్యుమోనియా’, పీ/ఎఫ్ రేషియో
115తో తీవ్రమైన ఏఆర్జీఎస్, టైప్-I రెస్పిరేటరీ
ఫెయిల్యూర్ ఉన్నట్లు గుర్తించారు. 10 లీటర్ల
ఆక్సిజన్ సపోర్ట్ అందిస్తున్న సమయంలో కూడా
ఆమె పీఏఓ2 కేవలం 69 ఎంఎంహెచ్ జీగా
నమోదైంది. పీ/ఎఫ్ రేషియో 115గా ఉండటంతో
తీవ్రమైన ఆక్సిజనేషన్ సమస్య ఉన్నట్లు వైద్యులు.
నిర్ధారించారు. డీ-డిమర్ 4023.45 ఎస్ జీ/
ఎంఎల్ (ఎఫ్ఎస్ఈయూ), ఎన్ టీ-ప్రోబీఎన్ పీ
632 పీజీ/ఎంఎల్ గా నమోదయ్యాయి. దీంతో
సీటీ పుల్మనరీ యాన్జిహోగ్రఫీ నిర్వహించగా
పల్మనరీ థ్రాంబోఎంబోలిజం లేదని తేలింది.
అయితే రెండు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ను సూచించే
కోలాప్స్ -కాన్సాలిడేషన్ ప్రాంతాలు, స్వల్ప ఎర్లీ
పల్మనరీ ఓడీమా, బిల్టరల్ మిడ్ ప్లీరల్ ఈప్సీఎన్
కనిపించాయి. రోగిలో తీవ్రమైన రక్తహీనత కూడా
ఉండగా, హిమోగ్లోబిన్ 7.5 జీ/డీఎల్ వరకు
పడిపోయినట్లు నమోదైంది. తీవ్రమైన శ్వాస
వైఫల్యం నేపథ్యంలో రోగిని ఎఎంసీయూ Uకు
తరలించి, 60 శాతం ఆక్సిజన్ హై ప్లో నాసల్
కన్జ శ్వాస సహాయం అందించారు. మెరోపెనెమ్,
లెవోఫ్లోక్సాసిన్ తదితర అధునాతన వైద్య చికిత్సలతో ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడారు. ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్, వాసుకిరణ్ రెడ్డి, ప్రశాంత్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *