Breaking
30 May 2026, Sat

జూన్ 6న నవోదయ – సైనిక్ స్కూల్ ప్రవేశం,ఉచిత కోచింగ్ కొరకు స్కాలర్ షిప్ టెస్ట్…

గ్రేటర్ న్యూస్,హనుమకొండ : నగరంలోని నంద్యాల అకాడమీ ఆధ్వర్యంలో 4వ, 5వ తరగతి విద్యార్థుల కోసం నవోదయ, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించేందుకు ప్రత్యేక స్కాలర్‌షిప్ టెస్ట్ ను జూన్ 6వ తేదీన నిర్వహించడం జరుగుతుందని ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు క్రింది విధంగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు అకాడమీ డైరెక్టర్ వంశీకృష్ణ ఐలి తెలిపారు.
✅ మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పూర్తిగా ఉచిత కోచింగ్
✅ 11వ ర్యాంకు నుండి 20వ ర్యాంకు వరకు సాధించిన విద్యార్థులకు కోచింగ్ ఫీజులో 60% రాయితీ
✅ పరీక్షలో అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి కోచింగ్ ఫీజులో 10% రాయితీ
నవోదయ, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పరీక్ష రిజిస్ట్రేషన్, పూర్తి వివరాల కోసం: 📞 9963058064, 9959558060 సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *