Breaking
30 Aug 2026, Sun

పదోన్నతి పొందుటకు అర్ముడ్ రిజర్వ్ పోలీసులకు ప్రీ ప్రమోషనల్ శిక్షణ ముగింపు…

గ్రేటర్, న్యూస్, మామునూర్ : 4వ బెటాలియన్ లో నేటి నుండి పదోన్నతి పొందుటకు అర్ముడ్ రిజర్వ్ పోలీసులకు ప్రీ ప్రమోషనల్ శిక్షణ ముగింపు కార్యక్రమంకు అసిస్టెంట్ కమాండెంట్ పి. కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరైనారు. తెలంగాణ అర్ముడ్ పోలీస్ విభాగానికి చెందిన పోలీసు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొందుటకు వీరికి 265 మంది హెడ్ కాని స్టేబుల్స్ కి రెండు వారాలపాటు శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణలో భాగంగా హెడ్ కానిస్టేబుల్స్ కి భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరికత సురక్ష సంహిత, స్పెషల్ అండ్ లోకల్ లాస్, భారతీయ సాక్ష్యం అధిన్యం,పోలీసు మాన్యూవల్,పర్సనాలిటీ డెవలప్మెంట్ అంశాలపై పూర్తి శిక్షణను నిష్ణాతులైన శిక్షకులచే ఇచ్చామని అసిస్టెంట్ కమాండెంట్ పి. కృష్ణ ప్రసాద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐలు విజయ్,,రవి, రాజ్ కుమార్ శిక్షణార్థులు, బెటాలియన్ అధికారులు, ట్రైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *