Breaking
1 Jun 2026, Mon

ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

గ్రేటర్ న్యూస్,హనుమకొండ: ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గురువారం దర్శించుకున్నారు.ఆలయ అధికారులు, పూజారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో కలెక్టర్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు ఆశీర్వచనం చేసి శేష వస్త్రాలను, స్వామి వారి ప్రసాదాన్ని కలెక్టర్ కు అందజేశారు.ఈ సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో కుడా (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) నిధులతో నిర్మాణం చేపట్టిన డార్మెటరీ హాలు పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులు నిలిచిపోయి అసంపూర్తిగా ఉండటంపై వివరాలు తెలుసుకుని, పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *