Breaking
26 Mar 2026, Thu

ఈ నెల 7న దిశా కమిటీ సమావేశం…

గ్రేటర్ న్యూస్,హనుమకొండ: ఈనెల 7వ తేదీన ( శనివారం) ఉదయం 11 గంటలకు దిశా కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ( దిశా ) సమావేశం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరుగుతుందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో 2025 ఏప్రిల్ నెల నుండి 2026 ఫిబ్రవరి వరకు జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని ఎంపీ అధ్యక్షతన సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *